ఆదివారం భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో ఆయన విగ్రహానికి పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సాయికుమార్, అశోక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ ఇచ్చిన 'విప్లవం వర్ధిల్లాలి' అనే నినాదాన్ని గుర్తుచేస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.