ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన న్యాయవాదుల పరిచయ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జీలుగా బాధ్యతలు చేపట్టిన దివ్యవాణి, తేజస్విని మాట్లాడుతూ, సమష్టిగా సమన్వయంతో కేసులను పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించటానికి కృషి చేద్దామని అన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సైతం సహకరించాలని కోరారు. బాధితులకు న్యాయం అందించటమే లక్ష్యంగా విధులు నిర్వహిద్దామని వారు పేర్కొన్నారు.