ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 44 పై భీంసరి బ్రిడ్జి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు వెళ్తున్న వర్మ ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది రేఖ, వసీం గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.