ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన లారీ యజమాని తన లారీలో పత్తి విత్తనాలను ఆసిఫాబాద్ జిన్నింగ్ మిల్లు నుండి ఆదిలాబాద్ కు శుక్రవారం ఉదయం తీసుకువెళ్తుండగా, కెరమెరి ఘాట్ లోని చివరి మూల మలుపు వద్ద గుంతలో పడి లారీ బోల్తా కొట్టింది. వాహన చోదకుడు చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటనతో శుక్రవారం సాయంత్రం వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.