ఆదిలాబాద్ జిల్లా బోరజ్ పరిధిలోని కామాయి గ్రామంలో మంగళవారం కోలా దేవన్న (53) అనే వ్యక్తి తన ఇంట్లో వైరింగ్ సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.