ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆడిటోరియంలో డాక్టర్స్ డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. రిమ్స్, ఐఎంఏ, ఐడీఏ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ దానిని ప్రారంభించారు. పలువురు వైద్యులు, మెడికోలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో వైద్యులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ చంద్రకాంత్, సిబ్బంది భరత్, నవీన్ కుమార్, సాయి, బాలకృష్ణ పాల్గొన్నారు.