ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పీడిత వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు వడ్డే ఓబన్న అని ఎమ్మెల్యే కొనియాడారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో వడ్డెర జాతిపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని నడిపించడంలో ఓబన్న కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు.