ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించి, మొత్తం రూ. 157.97 కోట్లతో (సుమారు రూ. 158 కోట్లు) అంచనా ఆదాయ వ్యయాలకు కౌన్సిల్ ఆమోదంతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు.