ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశం సోమవారం రసాభాసగా మారింది. ఎజెండా అంశాలపై బిజెపి, బిఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో సమావేశం అర్థవంతంగా ముగియలేదు. బిజెపి సభ్యులు కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ను ప్రశ్నించారు. సమావేశం విఫలమైందని బిజెపి సభ్యులు సంతకాలు చేయగా, చైర్ పర్సన్ బండారి అనూష, కాంగ్రెస్ సభ్యులు సమావేశం వాయిదా పడిందని ప్రకటించారు.