కేసుల పరిష్కారానికి రాజీ మార్గం ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. ఆదిలాబాద్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి కక్షిదారులకు రాజీ పత్రాలు అందజేశారు. వరకట్న వేధింపుల అదుపునకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సమయం, ధనం ఆదా అయ్యేలా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అందరి కృషితో లోక్ అదాలత్ విజయవంతం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.