ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ కొత్త మద్యం పాలసీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పాలసీ ప్రకారం, ఎంపికైన నూతన మద్యం దుకాణాలు నేటి నుంచి తెరచుకోనున్నాయి. జిల్లాలో మొత్తం 40 మద్యం షాపులు ఉండగా, ADB పరిధిలో 18, ఉట్నూర్ పరిధిలో 9, ఇచ్చోడ పరిధిలో 13 వైన్స్‌లు ఉన్నాయి. ADB పరిధిలో ఈ ఏడాది కొత్తగా 3 లిక్కర్ మార్టులు ఏర్పాటు కానున్నాయి, వీటికి అదనంగా ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.