ఆదిలాబాద్: ముగిసిన నామినేషన్ ప్రక్రియ

5చూసినవారు
మున్సిపల్ ఎన్నికల తొలి ఘట్టం నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. సమయం దగ్గర పడటంతో ఆదిలాబాద్ టీటీడీసీ నామినేషన్ కేంద్రానికి పలువురు అభ్యర్థులు హుటాహుటిన చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల అనంతరం పోలీసులు గేట్లను మూసివేశారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు తమ నామపత్రాలను దాఖలు చేయడానికి తరలివచ్చారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద అభ్యర్థులతో పాటు వారి మద్దతు దారులతో సందడి వాతావరణం కనిపించింది.

సంబంధిత పోస్ట్