ఆదిలాబాద్‌లోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన భార్గవి, పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 585 సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఆమె తండ్రి సుదర్శన్ మరణించారు. తండ్రి లేని లోటును భర్తీ చేస్తూ, తల్లి సవిత టైలర్‌గా పనిచేస్తూ కూతురిని ఉన్నత చదువులు చదివించారు. భార్గవి తన కఠోర శ్రమతో తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకుంది.