ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న హైదరాబాద్‌లో చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రం వెంటనే స్పందించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అడవుల నుంచి ఆదివాసులను వెళ్లగొట్టి అడవుల్లోని ఖనిజ సంపదను దోచుకోవడానికి సర్కార్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.