గ్రామపంచాయతీ కార్మికులకు గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ సీఐటీయూ నాయకులు శనివారం ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. వేతనాలు సకాలంలో అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి నెలా ఒకటో తేదీలోపు వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న కోరారు.