బేల మండల కేంద్రంలోని అశోక్‌నగర్‌లో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోచమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.