ఆదిలాబాద్: బైక్ ల దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

65చూసినవారు
ఆదిలాబాద్: బైక్ ల దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు
బైకులు దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఎస్సై విష్ణుప్రకాష్, సిబ్బంది నరేష్, నరేందర్, రమేష్ స్థానిక ఇంద్రానగర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన నదీమ్ ను విచారించగా బైకులు దొంగతనం చేసినట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. నిందితుడు బస్టాండ్ వద్ద ఒక వాహనం, రూరల్ పరిధిలో 2 వాహనాలు చోరీ చేయగా. వాటిని స్వాధీనం చేసుకున్నారు

సంబంధిత పోస్ట్