తెలంగాణ మలిదశ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివయ్య కోరారు. సోమవారం ఆదిలాబాద్‌లోని ముదిరాజ్ సంఘ భవనంలో పోలీసు కిష్టయ్య వర్ధంతిని నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముదిరాజ్ కులస్తుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షుడు దారవేణి రాము, సభ్యులు పాల్గొన్నారు.