ఆదిలాబాద్: ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి

0చూసినవారు
ఆదిలాబాద్: ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి
సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేల చిత్రపటాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, డిఇఓ రాజేశ్వర్‌లను కోరారు. బుధవారం వారు కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. జనవరి 3న సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు.