ఆదిలాబాద్లోని 11KV కైలాష్ నగర్ ఫీడర్ పరిధిలో చెట్ల నరికివేత కారణంగా ఈ నెల 3న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అసిస్టెంట్ ఇంజినీర్ కిరణ్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కైలాష్ నగర్, రవీంద్ర నగర్, పాత హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.