ఆదిలాబాద్‌లోని 11 కెవి కైలాష్ నగర్ ఫీడర్ పరిధిలో చెట్ల నరికివేత కారణంగా ఈ నెల 3న గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అసిస్టెంట్ ఇంజినీర్ కిరణ్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కైలాష్ నగర్, రవీంద్ర నగర్, పాత హౌసింగ్ బోర్డు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ అంతరాయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.