ఈనెల 5వ తేదీ గురువారం నాడు ఆదిలాబాద్‌లోని షాద్‌నగర్, కైలాష్‌నగర్, ఆర్‌ఎస్ గార్డెన్, ఫైవ్ స్టార్ మెడికల్ షాప్ ప్రాంతాలలో 11కేవీ పోల్ మరమ్మత్తు పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ అంతరాయం కొనసాగుతుందని, వినియోగదారులందరూ సహకరించాలని ఆయన కోరారు.