పెండింగ్ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలను బంద్ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలకు వచ్చిన విద్యార్థులను ఇంటికి పంపించారు. ప్రభుత్వం స్పందించేంతవరకు కళాశాలలు తెరవమని తెలిపారు.