ఆదిలాబాద్: ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేత

57చూసినవారు
ఆదిలాబాద్: ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేత
ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ అందుకున్న వారు 45 రోజుల్లో ఇంటి పనులను ప్రారంభించాలని వార్డ్ స్పెషల్ ఆఫీసర్ నవీన్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ భుక్తాపూర్ కాలనీలో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా లబ్ధిదారులకు నిధులను అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ ప్రశాంత్, మాజీ కౌన్సిలర్ సతీశ్, కమిటీ సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్