ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

66చూసినవారు
ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్ర‌నేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌పై ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేయ‌డాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఏఐసీసీ పిలుపు మేర‌కు బుధవారం పార్టీ శ్రేణుల‌తో క‌లిసి ప‌ట్ట‌ణంలో నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం, ఈడీకి వ్య‌తిరేకంగా నినాదాల‌తో హోరెత్తించారు.