తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గంజాల భాస్కర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారులకు రూ. 25 వేల గౌరవ వేతనం, ఇంటి స్థలం, ప్రభుత్వ పథకాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే ఉద్యమకారుల కుటుంబానికి ఐదెకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు.