కేంద్రం రైల్వేలో పనిచేస్తున్న లోకో పైలట్ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు సిరాజ్ ఆలం కోరారు. ఈ నేపథ్యంలో, ఆదిలాబాద్ లో నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం విధులు నిర్వహిస్తూనే లోకో పైలట్లు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. రైల్వేలో 50 శాతం డీఏను ఉద్యోగులకు పెంచినప్పటికీ, లోకో పైలట్లను విస్మరించారని, తమకు కూడా డీఏ పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.