ఆదిలాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ పనులు ఏప్రిల్, మేలో పూర్తి

0చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వచ్చే ఏప్రిల్, మే నెలలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా నేతృత్వంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రైల్వే, ఆర్ అండ్ బి అధికారులతో పాటు ఎమ్మెల్యే సమీక్షించారు. రూ. 94 కోట్ల కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ పనులు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.