ఉత్తమ ఉర్దూ జర్నలిస్టుగా ఆదిలాబాద్ వాసి షాహిద్

59చూసినవారు
ఉత్తమ ఉర్దూ జర్నలిస్టుగా ఆదిలాబాద్ వాసి షాహిద్
తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో శనివారం నిర్వహించారు. ఉత్తమ జర్నలిస్టుగా ఆదిలాబాద్‌కు చెందిన షాహిద్ అహ్మద్ తవక్కల్ ఎన్నికయ్యారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఆయనను శాలువాతో సత్కరించి మెమెంటో అందజేసి అభినందనలు తెలిపారు. ఉర్దూ భాష అభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడారు.