రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్, రోజూ వారి మెనూ, భోజనం, స్నాక్స్, టీచర్స్ రోజూ స్కూల్స్‌కి వస్తున్నారా లేదా తదితర వాటిని ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా అధికారులు తమ శాఖల పనితీరును ఆరా తీయాలని సూచించారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆద్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంజ్ తెలంగాణ పోస్టర్‌ను ఆవిష్కరించారు.