రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా, బోరజ్ మండలం మాండగడ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని హెడ్ మాస్టర్ అర్చన సూచించారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా ఎంప్లాయిస్ హెచ్ఆర్ రవికిరణ్, మేనేజర్ వెంకటేశ్వర్ కూడా పాల్గొన్నారు.