ఆదిలాబాద్: తాగునీటి సరఫరాలో సమస్య లేకుండా చూడండి

68చూసినవారు
ఆదిలాబాద్: తాగునీటి సరఫరాలో సమస్య లేకుండా చూడండి
గ్రామాల్లో తాగునీటి సరఫరాలో సమస్య లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. నీటి సరఫరా, మండల పరిషత్ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ, మున్సిపల్, పంచాయితీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పైప్ లైన్లు డ్యామేజ్ కాకుండా, నీరు వృథా కాకుండా చూసుకోవాలన్నారు.