ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి గురువారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. క్వింటాలుకు రూ. 8,000 మద్దతు ధర ఉందని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్ రెడ్డి, వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.