రాయితీ సిలిండర్ల పట్టివేత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పలు హోటల్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటల్లలో అక్రమంగా వినియోగిస్తున్న 08 డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకొని సీజ్ చేయడం జరిగిందని అని తెలిపారు. హోటళ్ళ యజమానులపై చర్యలకు పై అధికారులకు నివేదిక సమర్పించనైనదని అన్నారు. హోటల్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని ఈ సందర్భంగా తెలియజేయనైనది. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయి.