ఆదిలాబాద్: ఐరన్ మాత్రలు వికటించి ఏడుగురు విద్యార్థులకు అస్వస్థత

8చూసినవారు
ఆదిలాబాద్: ఐరన్ మాత్రలు వికటించి ఏడుగురు విద్యార్థులకు అస్వస్థత
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని కొలారి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం అనంతరం ఆశా కార్యకర్త ఇచ్చిన ఐరన్ (ఫోలిక్ యాసిడ్) మాత్రలు వేసుకున్న ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురు బాలికలు, ఇద్దరు బాలురు వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు వైద్యుల పర్యవేక్షణలో నిలకడగా ఉన్నారు.