అతివలకు అండగా ఆదిలాబాద్ షీ టీం: ఎస్పీ

1చూసినవారు
అతివలకు అండగా ఆదిలాబాద్ షీ టీం: ఎస్పీ
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, షీ టీం విస్తృత అవగాహన కార్యక్రమాలతో ప్రజలు, విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. నెల రోజులలో షీ టీం ద్వారా 4 ఎఫ్ఐఆర్, 30 ఈ పెట్టీ కేసులు నమోదు చేసి ఆకతాయిలను అడ్డుకున్నామని చెప్పారు. గ్రామాలలో మహిళలకు, పాఠశాలలలో విద్యార్థులకు సోషల్ మీడియా క్రైమ్, మహిళల పట్ల నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఎవరైనా వేధింపులకు గురైతే 8712659953 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్