ఆదిలాబాద్ షీటీం మహిళలకు అండగా ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అద్భుత ప్రదర్శనతో షీటీం రాష్ట్రంలో మూడవ స్థానం, పది జిల్లాల క్లస్టర్-IVలో ప్రథమ స్థానం సాధించింది. గత ఏడాది 35 ఎఫ్ఐఆర్లు, 261 పెట్టి కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా 277 అవగాహన కార్యక్రమాలు, 290 గ్రామాల సందర్శన, 59 కౌన్సిలింగ్లు నిర్వహించారు. షీటీంను డయల్ 100 లేదా 8712659953 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.