ఆదిలాబాద్: త్వరలో జీసీసీ ద్వారా జొన్నల కొనుగోలు కేంద్రాలు

689చూసినవారు
ఆదిలాబాద్: త్వరలో జీసీసీ ద్వారా జొన్నల కొనుగోలు కేంద్రాలు
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సంస్థ డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార్ తెలిపారు. మంగళవారం, ఆదిలాబాద్ జిల్లా మార్క్ ఫెడ్ జిల్లా అధికారి మహేశ్ కుమార్‌ను కలిసి జీసీసీకి కొనుగోలు కేంద్రాలు కేటాయించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 5 లేదా 6 కొనుగోలు కేంద్రాలు కేటాయిస్తామని మార్క్ ఫెడ్ జిల్లా అధికారి హామీ ఇచ్చినట్లు సందీప్ కుమార్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్