ఆదిలాబాద్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా సిబ్బందికి రంగులు పూసి, డీజే పాటలకు వారితో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. ప్రజలు చెరువులు, కాలువల వద్దకు వెళ్లవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్, ఏఎస్పీ మౌనిక, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొని రంగుల కేళిలో మునిగితేలారు.