హోలీ వేడుకలపై ఆదిలాబాద్ SP ఆంక్షలు: డీజేలకు నో, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినత

0చూసినవారు
హోలీ వేడుకలపై ఆదిలాబాద్ SP ఆంక్షలు: డీజేలకు నో, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినత
ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ హోలీ పండుగను మతసామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తుతో పాటు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. డీజేలకు అనుమతి లేదని, ఎవరిపై బలవంతంగా రంగులు చల్లరాదని హెచ్చరించారు. ఈత రానివారు చెరువులు, వాగుల వద్దకు వెళ్లకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్