ఆదిలాబాద్: ప్రత్యేక నిఘా పెట్టాలి: ఎస్పీ

2చూసినవారు
ఆదిలాబాద్: ప్రత్యేక నిఘా పెట్టాలి: ఎస్పీ
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, వాంకిడి సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును జిల్లా ఎస్పీ నితిక పంత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమ మద్యం, డబ్బులు, నిషేధిత వస్తువుల తరలింపును అరికట్టేందుకు వాహనాల తనిఖీలను పకడ్బందీగా చేపట్టాలని, నిఘా పెంచాలని ఎస్పీ ఆదేశించారు. మహారాష్ట్ర సరిహద్దు నుండి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ ఎస్పీ వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్