వేసవిలో మంచినీటి సమస్యను నివారించడానికి చర్యలు చేపడుతున్నామని సర్పంచ్ ఆత్రం నగేష్ తెలిపారు. బుధవారం సాత్నాల మండలం సాంగ్వి గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ. లక్ష నిధులతో మంచినీటి బోర్ వేయించారు. గ్రామంలో మొత్తం నాలుగు బోర్లు మంజూరు అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ విట్టల్, మధుర రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.