జైనథ్ మండలం పెన్ గంగా నది నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు సీఐ డి. సాయినాథ్, ఏఎస్ఐలు సిరాజ్, స్వామి సిబ్బందితో కలిసి లేకర్వాడ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు మూడు ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడ్డాయి. ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ. అక్రమంగా ఇసుక తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.