ఆదిలాబాద్ అర్బన్ సీఎం కప్ క్రీడా పోటీలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు ఎంఈఓ సోమయ్య మెడల్స్ అందజేశారు. విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడమే సీఎం కప్ పోటీల లక్ష్యమని ఆయన తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు హరిచరణ్, స్విమ్మింగ్ కోచ్ కృష్ణ, డాక్టర్ క్రాంతి, పాశం రాఘవేంద్ర పాల్గొన్నారు.