భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి స్ఫూర్తితో విద్యార్థులు చదువులో రాణించాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం అధ్యక్షుడు సుకుమార్ అన్నారు. శనివారం ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ఇటీవల పరీక్షల్లో రాణించిన విద్యార్థులకు ప్రశంసా పత్రం, గోల్డ్ మెడల్‌తో విద్యార్థినులను సత్కరించారు. చదువులో విద్యార్థులు రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.