వేసవి తాపాన్ని తీర్చేందుకు ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం లయన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని కలెక్టర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాటసారులకు మంచినీటిని అందజేసి చలివేంద్రాన్ని ఏర్పాటుచేసిన లయన్ గ్రూప్ సభ్యులను అభినందించారు.