ఆదిలాబాద్ లో అనుమతులు లేకుండా ఎంఎస్ అకాడమీ, నీట్ ఐఐటి అకాడమీ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. ఈ విషయమై గురువారం జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే యాజమాన్యంపై చర్యలు చేసుకోవాలన్నారు.