ఇంద్రవెల్లి మేజర్ పంచాయతీకి కొరెంగా సుంకట్‌రావు, గాంధారి దంపతులు వరుసగా రెండుసార్లు సర్పంచులుగా పనిచేశారు. 2001, 2006 ఎన్నికల్లో సుంకట్‌రావు గెలుపొందారు. 2013, 2019లో స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన సతీమణి గాంధారి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఎస్జీ జనరల్‌గా రిజర్వ్ కావడంతో సుంకట్‌రావు మూడోసారి బరిలో నిలిచారు. ఈ దంపతులు పంచాయతీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు.