మాతా శిశు మరణాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది పనిచెయ్యాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ రిమ్స్ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రసూతి వైద్య సేవలు, టీఫా స్కానింగ్, 108 వాహన సేవలు తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.