రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు ఆశన్న డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ లో మీడియాతో మాట్లాడారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికై ఈనెల 12న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, 13న హైదరాబాద్ డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.